Share News

జరిమానా పడకుండా నకిలీ నెంబర్‌ ప్లేట్‌

ABN , Publish Date - May 02 , 2026 | 11:16 AM

పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు, ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ ట్రాఫిక్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు.

జరిమానా పడకుండా నకిలీ నెంబర్‌ ప్లేట్‌
Fake Number Plate

  • ట్యాంపరింగ్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు, ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ ట్రాఫిక్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరు కసాబవాడి ప్రాంతానికి చెందిన నాగరాజు(26) అమీర్‌పేటలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. చలాన్లను తప్పించుకునేందుకు తన ద్విచక్రవాహనం నెంబర్‌ ప్లేట్‌(కేఏ 03 కేఎస్‌ 5500)కు బదులుగా(కేఏ 34 ఈఎస్‌ 3047) నెంబర్‌ ప్లేట్‌ను పెట్టుకున్నాడు.


city3.jpgనగరంలో పలుమార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. ఈ చలాన్లు నెంబర్‌ ప్లేట్‌ అసలు యజమాని కర్ణాటక బళ్లారి జిల్లా మారుతీకాలనీకి చెందిన వివేక్‌కు వెళ్తున్నాయి. దాంతో బాధితుడు ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల సహకారంతో నాగరాజును అరెస్ట్‌ చేశారు. నకిలీ నెంబర్‌ ప్లేట్‌లు, వాహనాల కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 11:16 AM