Share News

రాష్ట్రంలో విద్యుత్‌ సేవలు భేష్‌!

ABN , Publish Date - May 02 , 2026 | 04:50 AM

రాష్ట్రంలో అందుతున్న విద్యుత్‌ సంబంధిత సేవలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. నిరంతరాయ సరఫరా, సరఫరాలో నాణ్యత, సిబ్బంది అందుబాటును...

రాష్ట్రంలో విద్యుత్‌ సేవలు భేష్‌!

  • ఏప్రిల్‌లో 77.3 శాతం మందిలో సానుకూలత

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అందుతున్న విద్యుత్‌ సంబంధిత సేవలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. నిరంతరాయ సరఫరా, సరఫరాలో నాణ్యత, సిబ్బంది అందుబాటును ప్రధాన కొలమానాలుగా తీసుకుని ఇంధన శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. ఏప్రిల్‌ నెల ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ నివేదిక’ను అధికారులు విడుదల చేశారు. తమకు అందుతున్న విద్యుత్‌ సేవలు బాగున్నాయని 77.3ు మంది తెలిపారు. రాష్ట్రంలోని మూడు డిస్కంలకు గాను సీపీడీసీఎల్‌ 78.1శాతం సానుకూలతతో అగ్రస్థానంలో ఉండగా, ఈపీడీసీఎల్‌ 77.8 శాతం, ఎస్పీడీసీఎల్‌ 76.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా విశాఖపట్నంలో విద్యుత్‌ సేవలపై 82.4 శాతం సానుకూలత వ్యక్తమైంది. 71.6 శాతంతో అనంతపురం జిల్లా చివరన నిలిచింది. మే నెలాఖరు నాటికి సేవలను మరింత మెరుగుపరిచి..సానుకూలతను 78.1 శాతానికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంధన శాఖ అధికారులు తెలిపారు

Updated Date - May 02 , 2026 | 04:50 AM