రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:18 AM
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.
3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ ప్రకటన
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి వాయిస్‌తో...
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయి్‌సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) వీడియోను తయారు చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్‌పీఎఫ్) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్, పాన్, బ్యాంకు డిటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్‌లో (యూఎ్‌సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్ మెంట్ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు.
ఏపీకే ఫైల్స్‌తో రూ.30 లక్షలు..
ఏపీకే ఫైల్స్ పంపి.. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. నగరంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్ మెసేజ్ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్‌డేట్ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్‌డేట్ కోసం లింకును డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. అంతే మాల్‌వేర్ ఫోన్‌లో చేరి అతని ఫోన్‌ను క్రిమినల్స్ హ్యాక్ చేశారు. అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ. 10 లక్షలు కాజేశారు.
కూలీ నుంచి రూ. 20 లక్షలు..
మరో కేసులో దినసరి కూలీ ఖాతా నుంచి సైబర్ క్రిమినల్స్ రూ. 20లక్షలు కొట్టేశారు. ఆర్టీవో ఈ చలాన్ పేరుతో ఏపీకే ఫైల్స్ స్నేహితుల ఫోన్‌ల నుంచి వాట్సా్‌పలో వచ్చింది. అది మోసపూరితమైన లింక్ అనే విషయం తెలియని దినసరి కూలీ.. దాన్ని క్లిక్ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ ఆయన ఖాతా నుంచి రెండు విడతల్లో రూ. 20లక్షలు, మరో విడతలో రూ. 13,800 కొట్టేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News