నేను ఎస్‌ఐ.. కారు కావాలి..!
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:52 PM
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎస్‌ఐని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నకిలీ పోలీసు
కళ్యాణదుర్గం(అనంతపురం): ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎస్‌ఐని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమందేపల్లి మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కొన్ని నెలలుగా ట్రైనీ ఎస్‌ఐనని చెప్పుకుంటూ వాహనాలు, నగదు తీసుకుంటూ జల్సాలు చేసుకుంటున్నాడు. మూడు నెలల కిందట కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన మనోహర్ నుంచి కారు తీసుకున్నాడు. తాను శిక్షణలో ఉన్న ఎస్‌ఐని అని చెప్పి బురిడీ కొట్టించాడు.
కుటుంబంతో కలిసి కదిరి నరసింహస్వామి క్షేత్రానికి వెళుతున్నానని, కారు కావాలని అడగటంతో మనోహర్ ఇచ్చాడు. మరుసటి రోజు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి, రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు, కళ్యాణదుర్గం శివారులో నిందితుడు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్‌పై జిల్లా వ్యాప్తంగా కేసులు ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్
కాంగోలో అలజడి సృష్టిస్తున్న ఎబోలా.. 101 చేరిన మృతుల సంఖ్య..
Read Latest AP News And Telangana News And International News And Telugu News