గంజాయి పార్టీపై పోలీసుల దాడి.. ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:04 PM
హైదరాబాద్‌లోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
హైదరాబాద్, జూన్ 9: నగరంలోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీపై పోలీసులు దాడులు చేశారు. క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి... ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 220 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ దాడుల్లో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అతౌల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో భారీ చోరీ.. కేజీ బంగారు ఆభరణాల అపహరణ
హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
Read Latest Telangana News And Telugu News