Share News

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:46 PM

ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్‏కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

  • అనుమతి లేకుండా పాటల వినియోగంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్‏కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది. ‘బ్యాచిలర్‌ పార్టీ’ అనే సినిమాలో తమ అనుమతి లేకుండా రెండు పాటలను వాడుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. న్యాయ ఎల్లిదె, ఒమ్మె నిన్నన్ను అనే రెండు పాటల తమ సంస్థకు చెందినవని, వాటిని బ్యాచిలర్‌ పార్టీ సినిమాలో వాడుకున్నారని ఫిర్యాదు చేసింది.


న్యాయ ఎల్లిదె అనే పాటను కేవలం ఏడు సెకెన్లు, ఒమ్మె నిన్నన్ను అనే పాటను 31 సెకన్ల పాటు మాత్రమే వినియోగించామని రక్షిత్‌ శెట్టి తరుఫు న్యాయవాదులు వాదించారు. ఇంత తక్కువ సమయం వాడుకోవడం హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వాదించారు. వారి వాదనలను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. పాటల వినియోగం కాకతాళీయంగా జరుగలేదని, సినిమా కథకు అనుబంధంగా వాడుకున్నారని, వాణిజ్యపరంగా లాభం కోసం వాడుకున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది.


pandu2.2.jpgహీరో బాధలో ఉన్నప్పుడు న్యాయ ఎల్లిదె అనే పాటను వాడటం ఒక పథకం ప్రకారం జరిగిందని, ఇది హక్కుల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కోర్టు తేల్చి చెప్పింది. రక్షిత్‌శెట్టికు జైలుశిక్ష నుంచి మినహాయింపు ఇచ్చిన ధర్మాసనం రూ.25లక్షల జరిమానాలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

దేశంలో డిజిటల్‌ జనగణన ప్రారంభం

యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 01:46 PM