కాలేజీలో తప్పుడు ప్రచారం.. వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి..
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:47 PM
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాలేజీ ప్రొఫెసర్, తోటి విద్యార్థినుల వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేయటంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు, ఏప్రిల్ 2: కాలేజీ ప్రొఫెసర్, తోటి విద్యార్థినుల వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేయటంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలు తన సూసైడ్ నోట్‌లో తెలిపిన వివరాల మేరకు.. చిత్రదుర్గ జిల్లాలోని హోలల్‌కెరె టౌన్‌కు చెందిన 23 ఏళ్ల లిఖిత మల్లాదిహళ్లిలోని ఆయుర్వేద కాలేజీలో బీఏఎమ్ఎస్ చదువుతోంది. ప్రొఫెసర్ రాజు, ఆయన భార్య నిశా, కొంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ లిఖితపై కక్షగట్టారు.
లిఖిత ప్రొఫెసర్ రాజుతో ఎఫైర్ పెట్టుకుందంటూ కాలేజీలో తప్పుడు ప్రచారం చేయటం మొదలెట్టారు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించటం మొదలెట్టారు. వారి వేధింపులు రోజురోజుకు పెరగసాగాయి. లిఖత తట్టుకోలేకపోయింది. ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. చనిపోవడానికి ముందు తన బాధను తెలియజేస్తూ ఓ సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్‌లో.. ‘ప్రొఫెసర్ రాజు, ఆయన భార్య నిశా, ఫీమేల్ స్టూడెంట్స్( వారి పేర్లు) నా చావుకు కారణం. వాళ్లు నాపై కాలేజీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ప్రొఫెసర్‌తో సంబంధం ఉందని అందరికీ చెబుతున్నారు. వారి వేధింపులు, తప్పుడు ప్రచారాల వల్లే నేను చనిపోతున్నా’ అని రాసుకొచ్చింది.
హోలల్‌కెరె టౌన్, బసవ లేఅవుట్‌లో ఉన్న ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లిఖిత శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రెఫెసర్ రాజు, ఆయన భార్య నిశా, కొంతమంది విద్యార్థినులపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఇవి కూడా చదవండి
దుకాణదారుడు చేసిన తప్పు.. కస్టమర్‌కు కోట్లు కురిపించింది..
30 ఏళ్ల వయసులో లవ్.. ఈ తప్పులు అస్సలు చేయకండి