దుకాణదారుడు చేసిన తప్పు.. కస్టమర్‌కు కోట్లు కురిపించింది..
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:49 PM
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక దుకాణదారుడు చేసిన చిన్న పొరపాటు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సాధారణంగా మనం ఏదైనా దుకాణానికి వెళ్లినపుడు దుకాణదారుడు మనం అడిగినది కాకుండా, వేరొకటి ఇస్తే అతడితో వాదనకు దిగుతాం.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక దుకాణదారుడు చేసిన చిన్న పొరపాటు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సాధారణంగా మనం ఏదైనా దుకాణానికి వెళ్లినపుడు దుకాణదారుడు మనం అడిగినది కాకుండా, వేరొకటి ఇస్తే అతడితో వాదనకు దిగుతాం. మనకు కావాల్సింది మనం దక్కించుకుంటాం. అయితే ఓహియోకు చెందిన ఓ వ్యక్తి దుకాణదారుడి పొరపాటును నవ్వుతూ అంగీకరించాడు. దాంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు (Ohio lottery winner).
ఓహియో రాష్ట్రంలోని లేక్ కౌంటీలో నివసిస్తున్న ఒక వ్యక్తి మార్చి 14న కొన్ని లాటరీ టిక్కెట్లు కొనడానికి దుకాణానికి వెళ్లాడు. ఒక డాలర్ విలువ చేసే ఐదు టికెట్లు, ఒక ఐదు డాలర్ల టికెట్ కావాలని అడిగాడు. ఆ దుకాణదారుడు తొందరలోనో లేదా పొరపాటునో, అతనికి వేర్వేరు టిక్కెట్లు ఇవ్వకుండా, కేవలం ఒకే 10 డాలర్ల టికెట్ ఇచ్చాడు. అయితే ఆ వినియోగదారుడు అతడితో వాదనకు దిగకుండా తనకిచ్చిన టికెట్‌ను జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు. అలా చేయడమే అతడికి ఎంతగానో కలిసి వచ్చింది (Clerk mistake lottery).
లాటరీ ఫలితాలు వచ్చినప్పుడు చూసుకుంటే తన దగ్గర ఉన్న టికెట్‌కు 1.58 లక్షల డాలర్లు (సుమారు 1.5 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ వచ్చినట్టు తెలిసింది (Wrong ticket jackpot). దీంతో అతడు చాలా సంతోషించాడు. గెలిచిన డబ్బుతో మొదట తన పాత అప్పులు, బిల్లులు తీరుస్తానని చెప్పాడు. ఆ తర్వాత, మిగిలిన మొత్తాన్ని తన మనవళ్ల మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతానని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..