కూతురిని చంపి తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:48 PM
బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇమ్మడిహళ్ళిలో దారుణ సంఘటన జరిగింది. 40 ఏళ్ళ తల్లి సువర్ణ కుమార్తె కారుణ్య(14)తో కలిసి నివసిస్తుండేవారు. ముందుగా కుమార్తె కారుణ్యను గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి సువర్ణ హత్య చేశారు. ఆ తర్వాత పరుపుమీద శవంగా పడి ఉన్న కూతురు చెంతనే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
శనివారం ఉదయం ఇంట్లో అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైట్‌ఫీల్డ్ పోలీసులు తలుపులు తెరిపించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో బద్ధలుకొట్టారు. తల్లీబిడ్డల మృత దేహాలను గుర్తించారు. కాగా ఆత్మహత్యా లేదా ఇతరత్రా కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తల్లి ఎక్కడైనా డెత్‌నోట్ రాసి ఉందా అని పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిహార్‌లో ముగిసిన నితీష్ యుగం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి
జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ కేసులో కొత్త మలుపు
Read Latest Telangana News and National News