అన్నా వర్సిటీలో మళ్లీ లైంగిక వేధింపులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:18 PM
అన్నా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి.
ప్రొఫెసర్‌పై విద్యార్థిని ఫిర్యాదు
చెన్నై: స్థానిక అన్నా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి. వర్శిటీలోని ప్రొఫెసర్ తనను ప్రత్యక్ష్యంగా, సెల్‌ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లు చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని, తనను మాత్రమే కాకుండా, తన స్నేహితులు కొందరిపై కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడని తెలిపింది.
ఈ విషయమై వర్శిటీలోని కమిటీకి ఫిర్యాదు చేశారని, ఈవ్యవహారంపై సత్వరం చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరింది. విద్యార్థిని ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టాలని అభిరామపురం మహిళా పోలీసు స్టేషన్‌కు పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. కోట్టూరుపురం పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినిని మైలాపూర్ పోలీసు కమిషనర్ నేతృత్వంలో మహిళా పోలీసులు విచారిస్తున్నారు.
ప్రొఫెసర్ సస్పెన్షన్
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబును సస్పెండ్ చేస్తున్నట్లు అన్నా విశ్వవిద్యాలయం ప్రకటించింది.. శాఖాపరమైన విచారణ చేపట్టిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు శుక్రవారం వర్శిటీ ఎదుట ఆందోళనలు చేపట్టాయి.
ప్రొఫెసర్ అరెస్ట్
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అన్నా వర్శిటీ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తిరునల్వేలిలో ఉన్న జ్ఞానవేల్ బాబును అరెస్ట్ చేసి,విచారణ నిమిత్తం నగరానికి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు
Read Latest Telangana News and National News