హోర్ముజ్ జలసంధి దాటిన మరో రెండు నౌకలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:52 PM
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్‌కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, మార్చి 28: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్‌కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. భారత నౌకాదళం ఈ నౌకల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన రక్షణ కల్పిస్తున్నాయి.
భారత నౌకాదళ యుద్ధనౌకలు ఈ జలసంధి సమీపంలో 'స్టాండ్‌బై'లో ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రెండు నౌకలు ప్రయాణిస్తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని నౌకలు ఇదే మార్గంలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం భారతీయ జెండాతో ఉన్న 20 నౌకలు ఉన్నాయని, అందులో పనిచేస్తున్న సుమారు 540 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా చెప్పారు. ఇప్పటికే నాలుగు ఎల్‌పీజీ నౌకలు భారత్ చేరుకోగా, తాజా నౌకల రాకతో ఇళ్లకు వినియోగించే గ్యాస్ కొరత తగ్గే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News