Share News

టెస్లా రోడ్‌స్టర్ విన్యాసాలు వైరల్.. ఎగిరే కారుపై మీమ్స్‌తో నెటిజన్ల సందడి!

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:02 PM

ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌ కు చెందిన టెస్లా కంపెనీ మరోసారి సంచలన సృష్టిచింది. ఇటీవల అక్టోబర్ 15న ఆవిష్కరించిన తన కొత్త మోడల్ 'రోడ్‌స్టర్' (Roadster) కారుతో టెస్లా మరోసారి వార్తల్లో నిలిచింది.

టెస్లా రోడ్‌స్టర్ విన్యాసాలు వైరల్.. ఎగిరే కారుపై మీమ్స్‌తో నెటిజన్ల సందడి!
flying electric car

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌ కు చెందిన టెస్లా కంపెనీ మరోసారి సంచలన సృష్టిచింది. ఇటీవల అక్టోబర్ 15న ఆవిష్కరించిన తన నూతన తరం 'రోడ్‌స్టర్' (Roadster) కారుతో టెస్లా మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేసిన రాకెట్-ప్రేరేపిత థ్రస్టర్ల సహాయంతో ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ గాలిలో స్వల్పంగా ఎగిరి అద్భుతమైన విన్యాసాలు చేసింది.


అయితే, ఈ కారు నిజమైన విమానంలా నిరంతరం నింగిలో ప్రయాణించలేదని, కేవలం కొద్ది క్షణాల పాటు గాలిలోకి లేచేలా మాత్రమే దీన్ని డిజైన్ చేశామని కంపెనీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, రోడ్‌స్టర్ కారు ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు ఈ ప్రదర్శన వ్యక్తిగత రవాణా భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, ఆ కారు ధర, ఎగిరే దూరం, భద్రతా నియమాలపై ఇంకా అనేక సందేహాలు నెలకొన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో ఇలాంటి కార్లు ఎలా వర్క్ అవుతాయనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


మరోవైపు, 'రోడ్‌స్టర్' (Roadster) కారు ప్రదర్శనపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు, ఫన్నీ మీమ్స్‌కు కేంద్రబిందువుగా మారింది. ఇది నిజంగానే ఎగిరే కారా లేక కేవలం స్టంటా అంటూ నెటిజన్లు రకరకాల జోకులు పేలుస్తున్నారు. సామాజిక మా వేదికగా ఫన్నీ వీడియోలు, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ పరంగా ఒక గొప్ప అడుగుగా భావించిన ఈ ప్రదర్శన, ప్రస్తుతం నెటిజన్లకు వినోదాన్ని పంచుతోంది.


ఇవీ చదవండి:

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం

Updated Date - Oct 17 , 2026 | 04:07 PM