Share News

ఏలూరు, కొవ్వూరులో మున్సిపల్ నామినేషన్ల జోరు.. బరిలోకి కూటమి అభ్యర్థులు

ABN , Publish Date - Oct 17 , 2026 | 03:48 PM

ఏలూరు, కొవ్వూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. ఏలూరు మేయర్ అభ్యర్థిగా జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు, కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నేత కంటమణి విజయలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.

ఏలూరు, కొవ్వూరులో మున్సిపల్ నామినేషన్ల జోరు.. బరిలోకి కూటమి అభ్యర్థులు
Eluru Kovvur Municipal Elections

Eluru Kovvur Municipal Elections: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు ప్రాంతాల్లో కూటమి నాయకులు భారీగా తరలివెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.

ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు నామినేషన్

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తదితర కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కొవ్వూరు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా కంటమణి విజయలక్ష్మి

కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున కంటమణి విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు హాజరై అభ్యర్థికి సంఘీభావం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 03:53 PM