Share News

ఈ నైపుణ్యం మీలో ఉంటే.. ఏఐతో కాదు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం పోదు

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:16 PM

జనాభా పెరుగుదల రోజురోజుకు పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. ఇక ఉద్యోగాల సంగతికొస్తే సరే సరి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అనేది దాదాపుగా తగ్గిపోయింది.

ఈ నైపుణ్యం మీలో ఉంటే.. ఏఐతో కాదు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం పోదు

ఇంటర్నెట్ డెస్క్: జనాభా పెరుగుదల రోజురోజుకు పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. ఇక ఉద్యోగాల సంగతికొస్తే సరే సరి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అనేది దాదాపుగా తగ్గిపోయింది. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నా.. వాటికి పోటీ భారీగా ఉంటుంది. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను లే ఆఫ్‌ల పేరుతో బలవంతంగా ఇంటికి పంపుతున్నాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ) ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తోంది. దీని వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు తీవ్ర ముప్పు ఏర్పడనుందంటూ ఒక విధమైన భయాందోళన ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ప్రజలను చుట్టేస్తోంది.


అలాంటి వేళ.. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఆసక్తికర చర్చకు తెర తీశాడు. తన ఇంట్లో వడ్రంగి (కార్పెంటర్) కేవలం గంట పని చేసి రూ.900 సంపాదించాడని చెప్పారు. ఈ తరహా నైపుణ్యమైన వృత్తికి ఏఐతో ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశాడు. రాబోయే తరం.. ఈ తరహా నైపుణ్యాన్ని పొందితే అత్యంత నమ్మకమైన కెరీర్‌కు బాటలు వేస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. జస్ట్ గొడకు కొన్ని అరలు బిగించి.. రెండు పెయింటింగ్‌లు తగిలించే పనికి రూ.900 తీసుకున్నాడని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా కేవలం 45 నిమిషాల్లోనే ఈ పని ప్రారంభించి.. పూర్తి చేశారని వివరించారు. దీనిని బట్టి చూస్తే శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకే భవిష్యత్తు ఉందన్నారు. కాలం చెల్లిన డిగ్రీల కంటే యువత.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అలా అయితే వాటికి ఏఐ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లదని చెప్పుకొచ్చారు.


ముంబైలో సైతం..

గత నెలలో ముంబైకి చెందిన ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. మీరా రోడ్డు, బోరివాలి, కాండివాలి టౌన్‌షిప్‌ సోసైటీలలో ప్లంబర్‌గా పని చేసి ఈ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. అతనికి ఖరీదైన కారుతోపాటు సొంతిల్లు సైతం ఉన్నాయని వివరించాడు. ఇటీవల వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన వ్యక్తి గుర్తు చేశారు. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బ్లూ కాలర్ నిపుణులు భారీగా వేతనాలు పొందుతారని.. ఏఐ వల్ల అటువంటి వారి ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదని నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


నెటిజన్లు సైతం..

ఒక నెట్‌జన్ స్పందిస్తూ.. ఇది బెంగళూరులో సాధారణ విషయం. ఏ ఎలక్ట్రీషియన్, వడ్రంగి, ప్లంబర్‌ను పిలిచినా ఒకటి లేదా రెండు గంటల పనికి రూ. 1000 నుంచి రూ. 2 వేలు అడుగుతారు. దీనికి తోడు.. మన అవసరానికి తగినట్లుగా కాకుండా వాళ్ల ఇష్టానుసారంగా పని చేసి వెళ్లిపోతారని తెలిపారు. మరో నెటిజన్ అయితే తన అనుభవాన్ని కామెంట్‌ రూపంలో పొందుపరిచాడు. తన ఇంట్లో ఫాల్స్ సీలింగ్‌తోపాటు ఎలక్ట్రిక్ వైరింగ్ కోసం రూ. 30 వేలు చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అతని పనితనం తన మనస్సుకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే తాను కూడా పని చేయాలని తనకు ఆ సమయంలో అనిపించిందని చెప్పారు. ఇంకో అతను స్పందించారు. మనతో పోలిస్తే వియత్నాం దేశంలో తయారీ రంగం చాలా బాగా రాణించిందన్నారు. వారు ఉన్నత విద్యకు బదులుగా ప్రాథమిక, మాధ్యమిక విద్య పూర్తి చేస్తారు. అనంతరం వృత్తి శిక్షణపై వారు దృష్టిని కేంద్రీకరిస్తారని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ నాయకత్వంలో అణు రంగంలో దూసుకుపోతున్న భారత్: సీఎం చంద్రబాబు

బంకుల్లో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

Read Latest Business News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 09:21 PM