Share News

ఐపీఓకి ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌

ABN , Publish Date - Aug 28 , 2026 | 02:05 AM

హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఆర్‌డీఎంఓ) ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కూడా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది.

ఐపీఓకి ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌
crdmo

తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.800 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఆర్‌డీఎంఓ) ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కూడా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.800 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 2.73 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. మొత్తంగా సంస్థ ఈ ఇష్యూ ద్వారా రూ.3,500 కోట్ల వరకు సమీకరించే అవకాశాలున్నాయి.


దీపా జువెలర్స్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.168-177

హైదరాబాద్‌కు చెందిన హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాల డిజైనింగ్‌, ప్రాసెసింగ్‌, సరఫరా సంస్థ దీపా జువెలర్స్‌ లిమిటెడ్‌ రూ.460 కోట్ల ఐపీఓ.. సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఈ ఐపీఓలో భాగంగా విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.168-177గా నిర్ణయించింది.


సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా రూ.3,750 కోట్ల ఐపీఓ

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థ సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌.. ఐపీఓ ద్వారా రూ.3,750 కోట్ల వరకు సమీ కరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పిం చింది. ఐపీఓలో భాగంగా కంపెనీ పూర్తిగా తాజా ఈక్విటీనే జారీ చేయనుంది. ఈ మార్చి 31 నాటికి కంపెనీ 3.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

అల్యూమినియం ఉత్పత్తిలోకి రిలయన్స్‌!

ఐపీఓకు ఫ్రీడమ్‌ ఆయిల్‌
Read Latest 
AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 02:12 AM