పెట్ ఫుడ్స్ విభాగంలోకి విప్రో
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:20 AM
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. పెట్ ఫుడ్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. స్నగిల్స్ పేరుతో ప్రీమియం న్యూట్రిషన్ బ్రాండ్‌ను కంపెనీ విడుదల చేసింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. పెట్ ఫుడ్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. స్నగిల్స్ పేరుతో ప్రీమియం న్యూట్రిషన్ బ్రాండ్‌ను కంపెనీ విడుదల చేసింది. అంతర్జాతీయ డాగ్ డే సందర్భంగా కంపెనీ ఈ విభాగంలోకి ప్రవేశించిందని కంపెనీ ఫుడ్, న్యూ బిజినెస్ ప్రెసిడెంట్ అనిల్ ఛుగ్ వెల్లడించారు. బుధవారం నాడిక్కడ మార్కెట్లోకి స్నగిల్స్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత పెట్ ఫుడ్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ఈ మార్కెట్ పరిమాణం రూ.5,500 కోట్లుగా ఉందన్నారు. ఈ విభాగంలోని అవకాశాలను చేజిక్కించుకునే లక్ష్యంతో తాజాగా ఇందులోకి ప్రవేశించినట్లు ఆయన చెప్పారు. ఫ్రీజ్డ్ డ్రైడ్ చికెన్ చంక్స్‌తో ఈ పెట్ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర రూ.530 అని ఛుగ్ తెలిపారు.