ఐపీఓకు ఫ్రీడమ్ ఆయిల్
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:57 AM
ఫ్రీడమ్, బీ-రైట్, ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌నేమ్స్‌తో వంటనూనె ఉత్పత్తులను విక్రయిస్తున్న హైదరాబాద్ సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా...
న్యూఢిల్లీ: ఫ్రీడమ్, బీ-రైట్, ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌నేమ్స్‌తో వంటనూనె ఉత్పత్తులను విక్రయిస్తున్న హైదరాబాద్ సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (జీఈఎఫ్).. తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాల (డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసింది. ఈ ప్రతిపాదిత ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) రూపంలో ఉండనుంది. ఇందులో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 4.11 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్