ఆగస్టులో ఐపీఓల సందడి
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:38 AM
వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల సందడి నెలకొననుంది. ఆగస్టులో డజనుకు పైగా కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా...
పబ్లిక్ ఆఫర్‌కు రానున్న డజనుకుపైగా కంపెనీలు
రూ.25,000 కోట్లకుపైగా నిధుల సమీకరణకు చాన్ ్స
జాబితాలో జెప్టో, ట్రూహోమ్ ఫైనాన్స్, షిప్‌రాకెట్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో క్యాపిటల్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ల సందడి నెలకొననుంది. ఆగస్టులో డజనుకు పైగా కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరించడానికి సిద్ధమయ్యాయి. వీటిలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ట్రూహోమ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్ వంటివి ఉన్నాయి. ఈ ఇష్యూల ద్వారా రూ.25,000 కోట్లకు పైగా నిధులను కంపెనీలు సమీకరించే అవకాశం ఉంది. తాజాగా ఈక్విటీ జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా కంపెనీలు ఈ నిధులను సమీకరించనున్నాయని మర్చంట్ బ్యాంకర్లు వెల్లడించారు.
అతిపెద్ద ఇష్యూ జెప్టోదే..: ఆగస్టులో ఐపీఓకి వస్తున్న కంపెనీల్లో జెప్టోదే అతిపెద్ద ఇష్యూ. ఐపీఓలో భాగంగా కంపెనీ కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.8,010 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తోంది. అలాగే ట్రూహోమ్ ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల వరకు సమీకరించనుంది. ఇందులో రూ.1,500 కోట్ల తాజా ఇష్యూతో పాటు ఇదే మొత్తానికి సమానమైన ఓఎ్‌ఫఎస్ ఉంది. ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎలివేట్ క్యాంపసెస్ మొత్తం ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.2,550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. షిప్‌రాకెట్ ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ.2,342.35 కోట్ల మొత్తాలను సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓకి వస్తున్న ఇతర కంపెనీల్లో ఇన్నోవాటివ్యూ ఇండియా (ఓఎ్‌ఫఎస్ ద్వారా రూ.2,000 కోట్ల వరకు సమీకరణ), మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్ (రూ.1,553 కోట్లు), ధూత్ ట్రాన్స్‌మిషన్, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ (ఏఆర్‌సీఐఎల్), ఆర్డీ ఇండస్ర్టీస్, గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్, రేస్ ఆఫ్ బిలీఫ్, హై-టెక్ ఇంజనీర్స్, శంకేష్ జువెలర్స్, లెర్న్‌ఫ్యూయెన్స్ ఎడ్యుకేషన్ వంటి కంపెనీలు వస్తున్నాయి.
సెంటిమెంట్ మెరుగుపడటంతోనే..: మార్కెట్లు గాడినపడటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడటంతో ఇన్నాళ్లు వేచిచూసిన కంపెనీలు ఇప్పుడు తమ ఐపీఓ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయని ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ, ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ హెడ్ భవేష్ షా చె ప్పారు. అప్పుడప్పుడు అస్థిరత ఉన్నప్పటికీ భారత ఐపీఓ మార్కెట్‌కు సంబంఽధించి దీర్ఘకాలిక దృక్పథం బలంగానే ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు