ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. డ్రగ్స్ కేసులో అరెస్టైన వైసీపీ నేత సస్పెండ్
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:31 PM
డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు రోకళ్ల సత్యనారాయణపై వైసీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం మేరకు వైసీపీ స్పందించింది.
కాకినాడ, అక్టోబర్ 19: విదేశాల నుంచి డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తూ.. మే 25వ తేదీన కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ కాకినాడ మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ అలియాస్ సత్యపై వైసీపీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యంగా వెలుగుచూసిన వైసీపీ నేత అరెస్ట్ ఘటనపై ఏబీఎన్ కథనం మేరకు వైసీపీ స్పందించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి కొచ్చికి 3 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణను డీఆర్ఐ పోలీసులు కొచ్చి విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆయన రెండు బ్యాగుల్లో సబ్బు బిళ్లల ఆకారంలో దాచిన 20ప్యాకెట్ల మాదక ద్రవ్యాలను పోలీసులు గుర్తించారు. సత్యనారాయణతో పాటు కాకినాడకు చెందిన మరో నిందితుడు పాండిరి అర్జున్ కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుంచి కొచ్చికి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు? ఏపీలో విక్రయిస్తున్నారా? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం.. చరిత్రాత్మక విజయమన్న మంత్రి మండిపల్లి
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్
Read Latest AP News And Telugu News