ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:11 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖండించారు. నిరసనలు తెలిపే విధానాలు వేరే ఉంటాయని.. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
పశ్చిమ గోదావరి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. నిజాలను నిర్భయంగా చెబితే దాడులు చేయడాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించడాన్ని సభ్యసమాజం ఊరుకోదని రాజకీయ నేతలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా కూటమి నేతలంతా ముక్తకంఠంతో దాడులను వ్యతిరేకించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడిని ఖండించారు.
తాజాగా వైసీపీ దాడులపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. నిరసనలు తెలిపే విధానాలు వేరే ఉంటాయని.. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడులు చేయడమనేది నిరసనల్లో భాగంగా వైసీపీ భావిస్తోందని ఆయన అన్నారు. ఇలాగే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేయడంతో వై నాట్ 175 కాస్త 11 అయ్యిందని ఆర్ఆర్ఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మావిగన్' వస్తుంది, తాను తెస్తానని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అదే పనిగా చెబుతున్నారని ఆగ్రహించారు. ఏపీ అసెంబ్లీలో మావిగన్ బిల్లు పెడతానని జగన్ అంటున్నారని.. అది జరగదని డిప్యూటీ స్పీకర్ తేల్చిచెప్పారు.
జగన్ రోజూ సినిమాలు చూపిస్తే చూసేందుకు ఎవరూ ఖాళీగా లేరని రఘురామ మండిపడ్డారు. ఈ సందర్భంగా తన కస్టోడియల్ టార్చర్ కేసుపైనా స్పందించారు. తనను కొట్టిన వారిని శిక్షించమని అడుగుతున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడులో తండ్రికుమారులను కస్టోడియల్ టార్చర్ చేసి చంపిన కేసులో పోలీసులకు ఏమైందో తెలుసు కదా? అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన కేసులోనూ అలాగే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే సునీల్ కుమార్ అండ్ బ్యాచ్‌కు భయం పట్టుకుందని రఘురామకృష్ణరాజు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్
రాజకీయ నేతల ప్రవర్తన, పనితీరు యువతకు ఆదర్శంగా ఉండాలి: అయ్యన్నపాత్రుడు