Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - May 06 , 2026 | 11:38 PM

జిల్లాలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
Intermediate Supplementary Examinations

  • డీఆర్వో హేమలత

పార్వతీపురం, మే 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘ 16 కేంద్రాలో నిర్వహించే ఈ పరీక్షలకు 4,731 మంది విద్యార్థులకు హాజరుకానున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండరాదు. అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.


అతి సున్నితమై కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. ఇంటర్‌ మొదటి సంవత్సరం వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేయాలి. జెరాక్స్‌ షాపులు తప్పనిసరిగా మూసి వేయించాలి. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ప్రశ్న పత్రాలను 13 పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచాం.’ అని ఆమె తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 06:56 AM