Share News

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:09 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, వైసీపీ మహిళా విభాగం తమ మద్దతును ప్రకటించింది. విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు:  ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి
YSRCP Support Women Reservation Bill

విశాఖ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందించారు. ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ మహిళా విభాగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ బిల్లు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.


వైఎస్ జగన్ మహిళా పక్షపాతిగా పాలన సాగించారని, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. దిశ చట్టం, దిశ యాప్, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు వంటి చర్యలను తీసుకువచ్చి మహిళల రక్షణకు కట్టుబడి పనిచేశారని తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లు అమల్లోకి రావడం ద్వారా దేశంలో మహిళా సాధికారత మరింత బలోపేతం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..

ఏపీకి 38.. తెలంగాణకు 26.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న లోక్‌సభ స్థానాలు..

For More Latest News

Updated Date - Apr 16 , 2026 | 09:11 PM