Share News

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ

ABN , Publish Date - May 06 , 2026 | 01:09 AM

కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు.

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ
Pranav Gopal

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు. త్రిశూలం, ఢమరుకం, అక్కడి ప్లాట్‌ఫారం, ఇతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ ప్రాంతం చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, ఆకర్షణీయమైన మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 07:20 AM