రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది: మంత్రి నారాయణ
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:27 PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ స్థాయి అవార్డుల్లో.. స్వచ్ఛ షెహర్ (నగరం) విభాగంలో విశాఖ మున్సిపల్ కమిషన్ ప్రథమ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
విశాఖపట్టణం, నవంబర్ 12: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకి రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పనితీరుపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో ఏపీకి 6 అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అన్నీ రంగాల్లో ముందుకు వెళుతోందని.. అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. విశాఖ సదస్సులో కూడా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అన్నారు.
కేవలం ఎమ్వోయూలు కుదుర్చుకోవడమే కాకుండా.. అవి కార్యరూపం దాల్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పెట్టుబడులు రావాలంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉండాలని తెలిపిన మంత్రి.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా, సుభిక్షంగా ఉందన్నారు. అంతేకాకుండా.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..