అనకాపల్లి- చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు
ABN , Publish Date - May 02 , 2026 | 12:21 AM
అనకాపల్లి-చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల మూడో తేదీ నుంచి నడవనున్నది. 17046 నంబరుతో అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు చైర్మన్ సీఎం రమేశ్ పాల్గొంటారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
చర్లపల్లి నుంచి శనివారం, అనకాపల్లి నుంచి ఆదివారం సర్వీసులు
అనకాపల్లి టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి-చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల మూడో తేదీ నుంచి నడవనున్నది. 17046 నంబరుతో అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు చైర్మన్ సీఎం రమేశ్ పాల్గొంటారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం సాయంత్రం బయలుదేరే ఈ రైలు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, మహబూబబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం మీదు మీదుగా సోమవారం ఉదయం 7.20 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. 17045 నంబరుతో తొమ్మిదో తేదీ (ప్రతి శనివారం) రాత్రి 8.05 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి పదో తేదీన ఉదయం 9.25 గంటలకు అనకాపల్లి చేరుతుందని స్థానిక రైల్వేస్టేషన్ మేనేజర్ సచ్చినివాస్ తెలిపారు.