Share News

నేపాల్ జలప్రళయం.. తప్పించుకున్న విశాఖ వాసులు

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:57 PM

నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు అదృష్టవశాత్తూ జలప్రళయం నుంచి తప్పించుకున్నారు. వరద బీభత్సానికి ఒక్కరోజు ముందే వాళ్లు భారత్‌కు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

నేపాల్ జలప్రళయం.. తప్పించుకున్న విశాఖ వాసులు

ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నానికి చెందిన పది మంది అదృష్టవశాత్తూ నేపాల్ జలప్రళయం బారి నుంచి తప్పించుకున్నారు. సరిగ్గా వరద ప్రమాదానికి ఒక్కరోజు ముందే ఖాట్మండూ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఆగస్టు 11వ తేదీన వైజాగ్ నుంచి మానస సరోవరం యాత్రకు బయల్దేరిన వీరు.. వరద రాకముందే యాత్ర ముగించుకుని తిరుగు పయనమయ్యారు. దీంతో తమ బంధువులు క్షేమంగా ఉన్నారని ఈ యాత్రికుల కుటుంబ సభ్యులు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.


సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చిన విశాఖ వాసులు.. తమ తోటి యాత్రికులు ప్రమాదంలో చిక్కుకోవడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. తమతో వెళ్లినవారు వరదలో గల్లంతయ్యారని వాపోయారు. తాము నేపాల్‌లో ఉన్నప్పుడు తమకు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులూ కనిపించలేదని వివరించారు. తిరుగు ప్రయాణం మొదలుపెట్టినప్పుడే వరద బీభత్సం సృష్టించిందని తెలియడంతో ఆందోళన చెందామన్నారు. జగ్గీ వాసుదేవ్ బృందంలోని పలువురు సిబ్బందీ గల్లంతయ్యారని తెలిపారు.

కాగా.. నేపాల్‌లో సంభవించిన జలప్రళయం కారణంగా ఇప్పటివరకు 460 మందికి పైగా మరణించారు. సుమారు 1,500 మందికి పైగా ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైన వారిలో దాదాపు 300 మంది భారతీయులూ ఉన్నారు.


ఇవీ చదవండి:

రాజీనా.. రాజీనామానా?.. రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ

హెల్మెట్ లేనివారికి రాఖీ కట్టారు.. పోలీసుల వినూత్న కార్యక్రమం

Updated Date - Aug 28 , 2026 | 03:01 PM