Share News

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

ABN , Publish Date - Apr 29 , 2026 | 08:16 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యచంద్రులని జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అభివర్ణించారు.

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్
JanaSena Leader Murthy yadav

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యచంద్రులని జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అభివర్ణించారు. అలాంటి వారిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కౌంటర్‌గా బుధవారం విశాఖపట్నంలో మూర్తి యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీదంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.


వైసీపీ హయంలో పరిశ్రమలకు సమాధి రాళ్లు పడితే.. కూటమి హయంలో పునాది రాళ్లు పడుతున్నాయని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. సమాధి రాళ్లు.. పునాది రాళ్లు.. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయాన్ని గుడివాడ అమర్‌నాథ్ తెలుసుకోవాలన్నారు. అమర్‌నాథ్ మంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్‌పై అవాకులు, చెవాకులు పేలారని గుర్తు చేశారు.


అదే అమర్‌నాథ్ నేడు పవన్ కళ్యాణపై ప్రేమ కురిపిస్తున్నారని.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పారు. అప్పుడు బూతులు.. ఇప్పుడు ట్వీట్లా? బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. గుడ్డుకి...గాడిద గుడ్డుకు తేడా అమర్‌నాథ్‌కి తెలీదని.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోవాలని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల.. స్పందించిన కేంద్ర మంత్రి

టీడీపీకి గల్లీ పాలిటిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 08:36 PM