ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల.. స్పందించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:37 PM
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రూ.207 కోట్ల నిధులు విడుదల చేసింది.
అమరావతి, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రూ.207 కోట్ల నిధులు విడుదల చేసింది. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబనను పెంపొందించి, కుటుంబాల ఆదాయ స్థాయిని మెరుగుపరుస్తాయని తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను వేగవంతం చేస్తూ, వేలాది కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేందుకు దోహదపడతాయని చెప్పారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధులలో ప్రతి రూపాయి మహిళా శక్తికి బలమైన నాంది, ఆత్మ నిర్భర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దృఢమైన అడుగు’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీకి గల్లీ పాలిటిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: మంత్రి లోకేశ్
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News