Share News

అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:10 PM

అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు పడింది. కదులుతున్న రైలు నుంచి ఆమె పడిన తీరుపై సిమ్యులేషన్ ఆపరేషన్‌ను పోలీసులు ఆదివారం ప్రయోగించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జీఆర్పీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ సిమ్యులేషన్ ప్రయోగం నిర్వహించారు.

అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు

విశాఖపట్నం, అక్టోబర్ 11: అస్సాం యువతి హిమశ్రీ బోరో మృతి కేసులో కీలక ముందడుగు పడింది. కదులుతున్న రైలు నుంచి ఆమె పడిన తీరుపై సిమ్యులేషన్ ఆపరేషన్‌ను పోలీసులు ఆదివారం ప్రయోగించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జీఆర్పీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ సిమ్యులేషన్ ప్రయోగం నిర్వహించారు. ​మృతురాలి శరీర బరువుతో సమానమైన రెండు మానవ నమూనాలు (Mannequins), రంగు పూసిన రాళ్లను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ​నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైలు నుంచి బలవంతంగా తోసివేయడం, కుదుపులు, ప్రమాదవశాత్తు జారిపడటం తదితర వివిధ కోణాల్లో పరిశీలించారు.


ఫోరెన్సిక్ నిపుణులు, రైల్వే ఇంజినీర్లు, వైద్యులతోపాటు దర్యాప్తు అధికారుల సమక్షంలో వీటిని నిర్వహించారు. ​ఈ ప్రయోగంలో లభించిన ఫలితాలను ఇతర ఫోరెన్సిక్ నివేదికలతో విశ్లేషించి ఈ ఘటనపై పోలీసులు తుది నిర్ధారణకు రానున్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అస్సాం ఐజీ శివ ప్రసాద్, రైల్వే ఐజీ, డీఎస్పీ, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఈ సిమ్యులేషన్ ఆపరేషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు.


అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన హిమశ్రీ బోరాతో కూడిన బృందం.. ఇటీవల ఓ ప్రదర్శనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చింది. అక్టోబర్ 7వ తేదీ అర్ధరాత్రి విశాఖ నుంచి వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలులో అస్సాంకు బయలుదేరింది. ఆ రోజు ఉదయం పొందూరు మండలం పెనుబర్తి వద్ద రైలు పట్టాల పక్కన యువతి మృతదేహం ఉందంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందింది.


దీంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇది హిమశ్రీ బోరా మృతదేహంగా గుర్తించారు. ఆమె మృతిపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ... ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు కోసం అస్సాం నార్త్ జోన్ ఐజీ జీవీ శివప్రసాద్ శ్రీకాకుళం చేరుకున్నారు. హిమశ్రీ మృతి కేసు ఛేదించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ పేరుతో మైనారిటీల ఓట్ల తొలగింపు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

సంగారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.. మామను హత్య చేసిన అల్లుడు?

For More AP News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:18 PM