జగన్కు విధ్వంసం కావాలి.. అభివృద్ధి కాదు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:50 PM
జనం కోసం కాదు.. స్వార్థం కోసం జగన్ వైసీపీ జెండా ఎత్తారని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 29: జనం కోసం కాదు.. తన స్వార్థం కోసం జగన్ వైసీపీ జెండా ఎత్తారని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (గురువారం) ఆయన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మెల్యే మండిపడ్డారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వైసీపీ అధినేత ప్రజలకు ఏం న్యాయం చేస్తారని విమర్శించారు.
‘జగన్కు విధ్వంసం కావాలి అభివృద్ధి కాదు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఎన్నికలు అడ్డుకోవాలని 52 కేసులు వేశారు. అలాగే కేంద్రం నుంచి 14 వేల కోట్ల నిధులు రాకుండా అడ్డుపడాలనీ చూస్తున్నారు’ అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం విధ్వంస పాలన నుంచి విముక్తి పొంది, అభివృద్ధి వైపు ఉరకలేస్తుందని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
ఈ వార్తలూ చదవండి
కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 80 కుటుంబాలు
రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు