Share News

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా గెలుపు.. ఎంపీ కేశినేని ధీమా

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:28 PM

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా భారీ మెజార్టీతో గెలుస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ధీమా వ్యక్తం చేశారు.

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా గెలుపు.. ఎంపీ కేశినేని ధీమా

విజయవాడ, అక్టోబర్ 29: విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా భారీ మెజార్టీతో గెలుస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీ సమీపించిన వేళ ఎంపీ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లాలో కూటమి పార్టీల నేతలు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కడా రెబెల్స్ లేకుండా చూశాం. అయినా అక్కడక్కడా కొంతమంది పోటీలో రెబెల్స్‌గా ఉన్నారు. వారు తీరు మార్చుకోకుంటే.. పార్టీల నుంచి సస్పెండ్ చేస్తాం’ అని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.


అనంతరం ఈ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని కేశినేని శివనాథ్ చెప్పారు. ‘మాకు ఉన్న సర్వేల ప్రకారం విజయవాడలోని మేయర్‌గా వంగవీటి రాధా గెలవబోతున్నారు. అలాగే నగరంలోని 86 వార్డుల అభ్యర్థులూ విజయం సాధించబోతున్నారు. కూటమి ప్రభుత్వంలో చెప్పినవన్నీ చేశాం. అభివృద్ధి చేసి చూపించాం. 26వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. శాశ్వత నివాస, యాజమాన్య హక్కులు కల్పించి, 40 ఏళ్ల సమస్యలను పరిష్కరించాం. అందుకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలే నిర్ణయించారు’ అని ఆయన పేర్కొన్నారు.


వైసీపీ మాట్లాల్లో నిజం ఉండదు..

ఈ సందర్భంగా వైసీపీపై ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు చెప్పే మాట్లాల్లో ఏదీ నిజం ఉండదని, అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయంలో కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా చెల్లించలేదని ఆరోపించారు.

విజయవాడలో క్లీన్ స్వీప్.. బుద్దా వెంకన్న

గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వంగవీటి రాధా మేయర్ అభ్యర్థి కావడం కూటమికి కలిసి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ను అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు.

రెండేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి.. గద్దె అనురాధ

చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీల కలయికతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందని కొనియాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని ఆరోపించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పాలనకు రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 80 కుటుంబాలు

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి

Updated Date - Oct 29 , 2026 | 06:39 PM