Share News

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు.. రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:35 PM

టీడీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా, శ్రీ వైష్ణవి డెయిరీ సంస్థలకు చెందిన రూ.130 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు.. రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ed arrest bolebaba

అమరావతి, అక్టోబర్ 14: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన బోలేబాబా, వైష్ణవి డెయిరీ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.


టీటీడీకి రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో భోలే బాబా, శ్రీ వైష్ణవి డెయిరీ, సుకృతి ఫుడ్స్‌కు చెందిన ఆస్తుల అటాచ్‌ చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ సంస్థలు టెండర్లలో పాల్గొన్న ఫ్రంట్ డెయిరీల ద్వారా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. నకిలీ కొనుగోళ్లు, అమ్మకాలతో లావాదేవీలను నిజమైనవిగా చూపించినట్లు గుర్తించామని తెలిపింది. బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లింపులు చేసి, హవాలా మార్గంలో నగదు వెనక్కి మళ్లించారని భావిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. సంస్థల ప్రమోటర్లు విపిన్ జైన్, కైలాష్ చంద్ర మంగ్లా, వారి కుటుంబ సభ్యుల ఆస్తులపైనా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 05:39 PM