Share News

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న సుమో, ముగ్గురి మృతి

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:34 PM

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను సుమో ఢీకొనడంతో ముగ్గురు మరణించగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న సుమో, ముగ్గురి మృతి
tirupati accident

తిరుపతి జిల్లా, నవంబర్ 15: జిల్లాలోని చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను సుమో ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.


తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిక్స్ వే మార్గం నుంచి పాత సర్వీస్ సింగిల్ రోడ్డులోకి ప్రవేశించే సమయంలో ఎదురుగా వస్తున్న.. టిప్పర్‌ను సుమో ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో సుమోలో నలుగురు వ్యక్తులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు సమాచారం అందించగా.. హైవే అంబులెన్స్ గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించింది. కాగా.. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 08:39 PM