మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:55 PM
ఏపీలో లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 10: ఏపీలో లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఈడీ కస్టడీ నుంచి తిరిగి సిట్ కస్టడీకి తీసుకోవాలని సూచించింది.
ఇది తీవ్రమైన కేసు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఇది అత్యంత తీవ్రమైన కేసని, ఇందులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని ధర్మాసనంలోని మిగిలిన జడ్జిలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేసుతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల కేసులు సమాంతరంగా విచారణ జరిపితే తప్పేమిటని నిందితుల తరఫు న్యాయవాదులను సీజేఐ ప్రశ్నించారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత, సిట్ కస్టడీకి తీసుకునేందుకు ప్రొడక్షన్ వారెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం సంబంధిత కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మెరిట్స్ ఆధారంగా బెయిల్ దరఖాస్తును కోర్టు పరిశీలిస్తుందని తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు