శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:53 PM
తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎ పై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎపై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను శాసనమండలి చైర్మన్ తిరస్కరించారు.
దాంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పేపర్లు చించి గాలిలోకి ఎగరేశారు. అనంతరం మండలి నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్
For More TG News And Telugu News