Share News

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు..

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:10 PM

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు సోమవారం విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు..
ACB Raids

శ్రీకాకుళం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు ఇవాళ(సోమవారం) విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. జనవరి 28వ తేదీన కంచిలి ప్రాంతంలో బాలముకుందం వార్డెన్ల నుంచి రూ. 1.84 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు.


విద్యార్థుల నుంచి రూ.5లు వసూలు..

బీసీ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థుల నుంచి నెలవారీగా రూ.5ల చొప్పున వసూలు చేస్తున్నట్లు బాలముకుందంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల కారణంగా ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలముకుందం నివాసాల నుంచి సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 12:22 PM