రుషికొండ బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురి మృతదేహాల లభ్యం
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:59 AM
విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో సముద్రంలో గల్లంతైన ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్ మృతదేహాలను వెలికితీసి కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
విశాఖపట్నం, అక్టోబర్ 3: సెలవుల నేపథ్యంలో రుషికొండ బీచ్‌లో సరదాగా గడపడానికి వెళ్లిన స్నేహితులు ప్రమాదవశాత్తు శుక్రవారం సముద్రంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యంకాగా.. కేజీహెచ్ మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం పరిధిలోని మధురవాడ మల్లయ్యపాలెంకు చెందిన ఇద్దరు యువకులు, వాంబే కాలనీకి చెందిన మరో యువకుడు ఓ పాఠశాలలో చదువుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా.. సెలవు దినం కావడంతో ముగ్గురు బాలురు సముద్రతీరంలో గడపడానికి సాయంత్రం వెళ్లగా అలల తాకిడికి కొట్టుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్ మృతదేహాలను గాలించి ఒడ్డుకు చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి
Read Latest Telangana News And Telugu News