రాయలసీమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 07:15 PM
కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్.. ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌ను శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ పనితీరుకు నిదర్శనమని, ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాయలసీమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
అమరావతి, నవంబర్ 21: కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్.. ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌ను శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
‘కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌ను రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రారంభించింది. శంకుస్థాపన చేసిన కేవలం 12 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించింది. గత ఏడాది నవంబర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాది తిరక్కుండానే ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాంట్ నుంచి దేశ విదేశాలకు క్యాంపా కోలా, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను సరఫరా చేస్తారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పనితీరుకు నిదర్శనం.
రాయలసీమ గడ్డపై పునర్జన్మ ఎత్తిన స్వదేశీ బ్రాండ్ క్యాంపా.. అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్ధంగా ఉంది. స్థానిక యువతకు సొంత జిల్లాలోనే 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. లాజిస్టిక్స్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వేలాది మందికి ఉపాధి లభించింది. ఉద్యోగాల కోసం యువత వలస వెళ్లే పరిస్థితికి చెక్ పడింది. రాయలసీమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం ఉంచి భారీ పెట్టుబడి పెట్టిన రిలయన్స్ సంస్థకు ధన్యవాదాలు.. ’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’
Read Latest AP News And Telugu News