Share News

పూర్తిగా కోలుకున్న రాప్తాడు నిందితుడు.. బుధవారం డిశ్చార్జ్ చేయనున్న వైద్యులు

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:22 PM

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్ ఆరోగ్యం మెరుగుపడిందని.. బుధవారం ఉదయం అతడిని డిశ్చార్జ్ చేయనున్నామని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు వెల్లడించారు.

పూర్తిగా కోలుకున్న రాప్తాడు నిందితుడు.. బుధవారం డిశ్చార్జ్ చేయనున్న వైద్యులు
rapthadu case hemant health condition

కర్నూలు, నవంబర్ 17: కోర్టు ఆదేశాల ప్రకారం.. రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు నాలుగు రోజులుగా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉందని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు.


నిందితుడు హేమంత్‌కు మెరుగైన వైద్యాన్ని అందించామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. ​కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థో వైద్యుల పర్యవేక్షణలో నిందితుడికి చికిత్స అందించామన్నారు. నిందితుడి బీపీ, పల్స్, ఈసీజీ రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని వెల్లడించారు. నిందితుడు హేమంత్ పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో.. బుధవారం ఉదయం అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్లు డా. వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. పోలీసులు.. వైద్యుల నివేదికను జడ్డికి సమర్పించిన అనంతరం.. నిందితుడిని అనంతపురానికి తరలించనున్నారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:31 PM