ప్రకాశం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 8 గంటలకు ప్రారంభం
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:47 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు..144 సెక్షన్‌ను విధించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా, నవంబర్ 3: రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఈ రోజు(మంగళవారం) కౌంటింగ్ చేయబోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. చీరాల మున్సిపాలిటీకి చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో, మార్కాపురం మున్సిపాలిటీకి మార్కాపురం ఎస్వీకేపీ కాలేజీలో, గిద్దలూరు మున్సిపాలిటీకి గిద్దలూరు బాయ్స్ హైస్కూల్లో, కనిగిరి మున్సిపాలిటీలోని రెండు వార్డులకు ఏఎంసీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి