Share News

జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:26 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు.

జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Minister Gottipati Ravikumar

ప్రకాశం, జూన్ 29: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు. మూడు రాజధానులు అని చెప్పిన చోట ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రూ.450 కోట్లు ఖర్చు పెట్టి జగన్ ఉండేందుకు భవనం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. 30 వేల ఎకరాలకు తగ్గకుండా అమరావతిలో రాజధాని నిర్మాణం చెయ్యాలని జగన్ కూడా చెప్పారని గుర్తుచేశారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిలో ఇళ్లు కట్టుకుంటానని జగన్ చెప్పారన్నారు. ఎన్నికల తరువాత మూడు రాజధానులు అని.. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు నిలకడ మనస్తత్వం లేదన్నారు.


ఏపీకి ఏం కావాలి అన్న ఆలోచన జగన్‌కు లేదని మంత్రి విమర్శించారు. రోజుకొక రకమైన తిక్కభాష మాట్లాడుతున్నారన్నారు. జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసేందుకు వైసీపీ అధినేత కంకణం కట్టుకున్నారన్నారు. అమరావతిలో రెచ్చగొట్టేందుకు వెళ్లిన వైసీపీ నాయకుల్ని రైతులు తరిమికొట్టారన్నారు. పొగాకు కొనుగోలులో నో బిడ్‌లు తగ్గాయని.. అన్ని కంపెనీలు వేలంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వేలంలో పాల్గొనని కంపెనీలకు నోటీసు ఇవ్వమని చెప్పామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 12:26 PM