Share News

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

ABN , Publish Date - Jun 29 , 2026 | 10:48 AM

ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
Hostel Warden Suspended

ఏలూరు, జూన్ 29: జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సోషల్ వెల్ఫేర్ అధికారులు, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి.. హాస్టల్ వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అలాగే మరో హాస్టల్‌కు సంబంధించిన వార్డెన్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు.


దుప్పటి అడిగిందని రాత్రి సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థినిని వార్డెన్ స్పప్న హాస్టల్ నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. బాలిక ఉదంతంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. దీంతో వార్డెన్ స్పప్నపై కలెక్టర్ వెట్రి సెల్వి చర్యలు తీసుకున్నారు. ఈ అంశంపై సోషల్ వెల్ఫేర్ అధికారులు ఈరోజు(సోమవారం) అధికారికంగా విచారణ చేపట్టనున్నారు. విచారణకు హాజరుకావాలని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు

తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్‌చల్.. తీరంలో హైటెన్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 12:29 PM