అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:39 AM
ఏరువాక పున్నమి సందర్భంగా అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, జూన్ 29: ఏరువాక పున్నమి సందర్భంగా అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఏరువాక అని గుర్తు చేశారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనం ఆ సంప్రదాయాలను పాటిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, మన ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని రైతులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు జమ చేసి.. వారికి అండగా నిలిచామని స్పష్టం చేశారు. ఎల్‌నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతన్నలు అధిగమించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
రాజధాని రోడ్లపై దూసుకుపోతున్న మహిళ.. ఇలా కూడా కారు నడుపుతారా?
For More AP News And Telugu News