Share News

పత్రికను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు: పిల్లి మాణిక్యరావు

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:45 PM

తప్పులు, నేరాలు, అక్రమాలు చేయడం.. పక్క వారిపై బురద చల్లడం జగన్ అండ్ కో కు ఆనవాయితీగా మారిందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు విమర్శించారు.

పత్రికను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు: పిల్లి మాణిక్యరావు
pilli manikya rao criticizes ys jagan

గుంటూరు, నవంబరు 22: వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్లిన సొంత చెల్లిపై ఇష్టానుసారంగా వార్తలు రాయడం సిగ్గుచేటని గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు అన్నారు. ఇప్పుడు ఆస్తుల తగాదాల విషయంలో కూడా జగన్.. చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మాణిక్య రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాణిక్య రావు జగన్‌పై ధ్వజమెత్తారు.


‘సాక్షి పత్రికను, మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తండ్రి, బాబాయిని చంపిన వ్యక్తి.. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటిన దుర్మార్గుడు జగన్. తప్పులు, నేరాలు, అక్రమాలు చేయడం.. పక్క వారిపై బురద చల్లడం జగన్ అండ్ కో కు ఆనవాయితీగా మారింది. వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి షర్మిల వెళితే ఇష్టానుసారంగా వార్తలు రాయడం సిగ్గుచేటు. చంద్రబాబు, షర్మిలను ఉద్దేశిస్తూ.. చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం చేయడం చూస్తుంటే.. వీళ్ళు మనుషులా మానవ మృగాలా అర్థం కావడం లేదు.

ఇప్పుడు ఆస్తి తగాదాల విషయంలో కూడా జగన్.. చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేడు చంద్రబాబుపై అసత్య ప్రచారాలు, అబద్దపు రాతలతో వ్యక్తిగత బురద చల్లడం సిగ్గు చేటు. నీచ మనస్తత్వం కలిగిన జగన్ మనిషా.. మానవ మృగమా.. అనేది ప్రజలే మరొక్కసారి గుర్తిస్తారు’ అంటూ మాణిక్య రావు జగన్‌పై మండిపడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 12:45 PM