Share News

Pawan Kalyan Visit Kondagattu Temple: రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:05 PM

తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి రేపు (శనివారం) ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు.

Pawan Kalyan Visit Kondagattu Temple: రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Kondagattu Anjaneya Temple

అమరావతి, జనవరి 2: రేపు(శనివారం) తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి.. ఈ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య డిప్యూటీ సీఎం పవన్ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు.


గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్(Pawan Kalyan).. ముక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో అక్కడ నిర్మాణాలకు సంబంధించిన అంశాలను అర్చకులు పవన్ కు వివరించారు. కొండగట్టు క్షేత్రంలో నిర్మాణాలపై సీఎం చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో నిర్మాణాలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును కోరారు. చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ చైర్మన్ తో పవన్ చర్చించారు. అనంతరం రూ.35.19 కోట్లు(TTD funds) మంజూరుకు టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది.


ఈ నిధులతో కొండగట్టు ఆలయంలో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపాన్ని నిర్మించనున్నారు. శనివారం పవన్ తో కలిసి టీటీడీ ఛైర్మన్ బి ఆర్ నాయుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, ఇతర నేతలు పాల్గొనున్నారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితో భేటీ అవనున్నారు. ఈ భేటీలు, సమావేశాలు కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ

వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 04:23 PM