YouTuber Anvesh: అన్వేష్ కొత్త డ్రామా.. హిందూ దేవుళ్లు కలలో కనిపించారంటూ..
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:32 PM
యూట్యూబర్ అన్వేష్ విడుదల చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంజనేయ స్వామి, విష్ణుమూర్తి కలలో వచ్చి ప్రజా సమస్యలు, మహిళల హక్కులపై పోరాటం చేయాలని చెప్పారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవుళ్లే టార్గెట్‌గా వరుసగా వీడియోలు చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సీతమ్మ, ద్రౌపదిపై దారుణమైన కామెంట్లు చేసిన అన్వేష్ తీవ్ర స్థాయిలో హిందువుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్షమాపణ చెప్పి జనాలను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. జనాలు అతడి మాటలు వినకపోవటంతో కొత్త డ్రామాకు తెరతీశాడు. అంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కలలోకి వచ్చారని అంటున్నాడు. బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్లు చెప్పారంటూ కొత్త నాటకం మొదలెట్టాడు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో.. ‘విష్ణుమూర్తి కలలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి రంగులో కాషాయం వస్త్రం, మతం మత్తులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లకి అండగా ఉండాలి, ఆడవాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్లు చెప్పారు. విష్ణు మూర్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. బూతులు మాట్లాడను’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోతో మరోసారి సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. అన్వేష్ హిందూ దేవుళ్లపై కావాలనే వీడియోలు చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ..
అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు సమర్పించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చే వివరాల ద్వారా అన్వేష్‌కు పోలీసులు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. నోటిసుల తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం
ఇలాంటి నీళ్లు తాగితే ప్రాణాలకు ముప్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి