Share News

Contaminated Water: ఇలాంటి నీళ్లు తాగితే ప్రాణాలకు ముప్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ABN , Publish Date - Jan 02 , 2026 | 03:00 PM

మనకు ఎంతో స్వచ్ఛంగా కనిపించే నీటిలో కూడా చాలా రకాల క్రిములు, రసాయనాలు, కలుషితాలు ఉంటాయి. అలాంటి నీటిని తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటం ఖాయం.

Contaminated Water: ఇలాంటి నీళ్లు తాగితే ప్రాణాలకు ముప్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Contaminated Water

ఏ కాలం అయినా సరే కలుషిత నీటితో ప్రాణాలకు ముప్పు తప్పదు. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1100 మంది తాము కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలైనట్లు చెబుతున్నారు. భగీరథ్‌పురా ప్రాంతంలోని మంచి నీటి‌ పైప్‌లైన్‌లోకి మురుగు నీరు వచ్చి చేరడంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. కేవలం ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.


మనకు ఎంతో స్వచ్ఛంగా కనిపించే నీటిలో కూడా చాలా రకాల క్రిములు, రసాయనాలు, కలుషితాలు ఉంటాయి. అలాంటి నీటిని తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటం ఖాయం. అందుకే నీటిని శుభ్రం చేసుకుని తాగాలి. ఈ ఐదు పద్దతుల ద్వారా నీటిని శుభ్రం చేసుకుని తాగితే ఎలాంటి సమస్య రాదు.


నీటిని వేడి చేయటం

వేడి చేయటం ద్వారా నీటిని చాలా తేలికగా శుభ్రం చేయవచ్చు. వేడి చేయటం వల్ల అందులోని క్రిములు చనిపోతాయి. ఒక నిమిషం నుంచి మూడు నిమిషాల వరకు నీటిని వేడి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నీటిని వేడి చేసిన తర్వాత చల్లార్చి తాగాలి.

వాటర్ ప్యూరిఫైయర్స్

నీటిని శుభ్రం చేయడానికి వాటర్ ప్యూరిఫైయర్లు వాడటం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్లు నీటిలోని ప్రమాదకర ఖనిజాలు, కెమికల్స్, క్రిములను తొలగిస్తాయి.


యాక్టివేటెడ్ చార్‌కోల్

యాక్టివేటెడ్ చార్‌కోల్ కలుషిత నీటిని చాలా చక్కగా శుభ్రం చేస్తుంది. అంతేకాదు.. ప్రమాదకరమైన ఖనిజాలను తొలగించి నీటిని రుచికరంగా మారుస్తుంది. అయితే, చార్‌కోల్ బ్యాక్టీరియా, వైరస్‌లను చంపలేదు. మిగితా వాటితో కలిపి దీన్ని వాడుకుంటే మంచిది.

రసాయన పద్ధతి

క్లోరిన్, అయోడిన్ వంటి రసాయనాలను ఉపయోగించి నీటిని శుభ్రం చేయవచ్చు. నీటిని వాడుకునే ముందు కొన్ని చుక్కల క్లోరిన్ కానీ, అయోడిన్ కానీ నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగాలను కలిగించే క్రిములు చనిపోతాయి.

సోలార్ వాటర్ డిస్‌ఇన్‌ఫెక్షన్

ఈ పద్దతి ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, శ్రమ పడకుండా నీటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా నీటిని ఎండ తగిలే ప్రదేశంలో పెట్టడమే. అయితే, నీటిలో దుమ్ము పడకుండా ఉండేలా పెట్టుకుంటే మంచిది.


ఇవి కూడా చదవండి

ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి

పుతిన్‌పై డ్రోన్ కుట్ర.. తోసిపుచ్చిన అమెరికా నిఘా వర్గాలు

Updated Date - Jan 02 , 2026 | 03:44 PM