CIA: పుతిన్‌పై డ్రోన్ కుట్ర.. తోసిపుచ్చిన అమెరికా నిఘా వర్గాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:46 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది..
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్(Putin) నివాసంపై ఉక్రెయిన్(Ukraine) డ్రోన్లతో దాడి(drones attack) కి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ(CIA )సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాలోని నోవ్‌గోరోడ్(Novgorod) ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ 91 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని CIA తేల్చి చెప్పింది. ఉక్రెయిన్.. నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఒక సైనిక స్థావరాన్ని (Military) లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చని, పుతిన్ నివాసంపై దాడి చేసే ఉద్దేశం అసలు లేదని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషించారు. CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్.. ఈ విషయం గురించి ఇంటెలిజెన్స్ ట్రంప్‌నకు అప్‌డేట్ చేసినట్లు సమాచారం.
ఉపగ్రహ చిత్రాలు, రాడార్ కవరేజ్,కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ తో సహా అనేక రకాల సాధనాల ద్వారా యూఎస్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీలు రష్యా లోపల పరిస్థితులను ట్రాక్ చేస్తాయని వాట్ స్ట్రీట్ జర్నల్ (WSJ)ని వేదించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి విషయంలో తొలుత అమెరికా అధ్యక్షుడు సైతం తీవ్ర అసహనం చేశారు. కానీ, డైరెక్టర్ జాన్ రాట్ ఇచ్చిన పూర్తి నివేదికల తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. కాగా, డిసెంబర్ 29న పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ ఎటాక్ కి పాల్పపడిందని, తమ రక్షణ వ్యవస్థలు వాటిని తిప్పికొట్టాయని రష్యా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని డ్రోన్ సిథిలాలను రష్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, తాము ఎలాంటి డ్రోన్ దాడులు చేయలేదని, రష్యా తన దుశ్చర్యలను సమర్ధించుకోవడానికే ఆరోపణలు చేస్తుందని తొసిపుచ్చారు.
ఇవీ చదవండి:
బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి
గాలి జనార్దన్ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదు