ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:56 PM
ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
అమరావతి, సెప్టెంబరు 6: రానున్న మూడు గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(ఏపీఎస్డీఎమ్ఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎమ్ఏ తెలిపింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు ఉండకూడదని, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
బద్దలైన అగ్నిపర్వతం.. 6 ఎయిర్‌పోర్టుల మూసివేత