Share News

బద్దలైన అగ్నిపర్వతం.. 6 ఎయిర్‌పోర్టుల మూసివేత

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:13 PM

ఇండోనేషియాలో నేడు తెల్లవారుజామున అనక్ క్రకటావో అగ్నిపర్వతం బద్దలైంది. జావా, సుమాత్రా దీవుల మధ్యలోని సముద్రంలోగల ఓ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం ఉంది.

బద్దలైన అగ్నిపర్వతం.. 6 ఎయిర్‌పోర్టుల మూసివేత
Anak Krakatau Volcano

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియాలో నేడు తెల్లవారుజామున అనక్ క్రకటావో అగ్నిపర్వతం బద్దలైంది. జావా, సుమాత్రా దీవుల మధ్యలోని సముద్రంలోగల ఓ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈ నేపథ్యంలో జకార్తా సహా సమీపంలోని ఆరు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. ఫలితంగా 301 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 58 ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా రద్దయ్యాయి.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నిపర్వతం పేలింది. దాదాపు 30 సెకెన్ల పాటు లావా ఎగసిపడిందని అక్కడి జియోలాజికల్ సర్వే సంస్థ పేర్కొంది. అయితే, పర్వతానికి 16 కిలోమీటర్ల సమీపంలో మానవ ఆవాసాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఎవరికీ అపాయం జరిగినట్టు కూడా వార్తలు లేవని అన్నారు. అగ్నిపర్వతానికి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాలని పర్యాటకులను ఆదేశించారు.

అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో దుమ్మూధూళి మేఘాలు జకార్తా ఎయిర్‌పోర్టుకు సమీపంలో కనిపించాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను నిలిపివేశామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఇండోనేషియా పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఇక విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

450 ఏళ్ల మ్యాప్‌నకు యూఎన్ మార్పులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్.. కానీ

ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్

Updated Date - Sep 06 , 2026 | 02:41 PM